
ఉత్తమ జాతీయ నటుడు అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్…. ప్రజాలహరి, జనరల్ డెస్క్.. 69వజాతీయస్థాయి ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లలో పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు కేటగిరిలో అల్లు అర్జున్ ఎంపిక అయ్యారు . త్రిబుల్ ఆర్, జై భీమ్ , పోటీపడిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన నటనకు 69వ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ ఉత్తమ నటుడు అవార్డును కైవసం చేసుకున్నారు. ఉత్తమ తెలుగు సినిమాగా ఉప్పెన, ఉత్తమ లిరిక్ గా సుభాష్ చంద్రబోస్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా దేవి ప్రసాద్, కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ తెలుగు క్రిటిక్ అవార్డు పురుషోత్తమాచార్యులు గెలుచుకున్నారు.