Ultimate magazine theme for WordPress.

మెదక్ కు వరాలు ప్రకటించిన కేసీఆర్

Post top
home side top

మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు.. ప్రజాలహరి జనరల్ డెస్క్..

 

మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. మెదక్ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్‌, ఎస్‌పీ ఆఫీసుల ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎన్నికలప్పుడు నేను ఒక మాట చెప్పాను మీ అందరికి పద్మ నా బిడ్డ అని.. ఆమె అడిగిందంటే ఏది కాదనే పరిస్థితి కాదు. గౌరవించి, దీవించి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించారు. దాని ఫలితమే.. కలెక్టరేట్, ఎస్‌పీ ఆఫీసు. మంచి నాయకురాలు ఉంది కాబట్టి మంచి పనులు జరుగుతున్నాయి. నాతో ఉద్యమంలో మొదటి రోజు నుంచి ఉండి, ఆనాడు తెలంగాణ వస్తదో రాదో తెల్వదు. ఉద్యమ కార్యకర్త నుంచి జడ్పీటీసీ వరకు ఆ విధంగా.. ఈ రోజు అనేకమైన పనులు చేస్తూ మీ మధ్య ఉన్నటువంటి బిడ్డ పద్మా దేవేందర్ రెడ్డి అని కేసీఆర్ పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో రోడ్లు చిందరవందరగా ఉన్నాయి.. అవి బాగు కావాలని పద్మ అడిగారని కేసీఆర్ గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలకు డబ్బులు కావాలని అడిగారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగారు. దీనికి సంబంధించి ఎల్లుండి సాయంత్రం లోగా జీవో పంపిస్తాను. ఆ విధంగానే రామాయంపేటలో కూడా డిగ్రీ కాలేజీ అత్యవసరంగా మంజూరు చేస్తాం. మెదక్‌కు రింగ్‌రోడ్డు కావాలని అడిగారు.. మంజూరు చేస్తున్నాం. అదే విధంగా ఏడు పాయల టెంపుల్ గతంలో ప్రకటించిన టూరిజం ప్యాకేజీలో భాగంగా 100 కోట్లతో అభివృద్ధి పనులను మంజూరు చేస్తున్నాం. పనులు కూడా మొదలు పెడుతాం. కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తాం. మెదక్ జిల్లా వ్యాప్తంగా 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామపంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాం. అదే విధంగా 4 మున్సిపాలిటీలు మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూఫ్రాన్ ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్ ప్రకటించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.