
చంద్రయాన్ 3 విజయవంతం… శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మోడీ …. ప్రజాలహరి, జనరల్ డెస్క్… చంద్రయాన్ 3 ఇస్కో ప్రయోగం విజయవంతమైంది ఈరోజు సాయంత్రం 5:44 నుంచి 6:04 నిమిషాల్లోపు విక్రమ్ లాండర్ చంద్రుడుపై ల్యాండ్ అయింది. చంద్రునిపై అడుగునపెట్టిన నాలుగో దేశంగా భారతం రికార్డు ఎక్కింది. అంత ముందుకు అమెరికా, రష్యా, చైనా దేశాలు లాండింగ్ లు చే శాయి. అప్పటివరకు దక్షిణం ధ్రువంపై ఏ దేశం అడుగుపెట్టలేదు .భారత శాస్త్రవేత్తలు ఇస్రో వారు ప్రయోగాత్మకంగా దక్షిణ ధ్రువంలో విక్రమ్ ల్యాండర్ను ల్యాండ్ చేయించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా నుంచి లైవ్ లో భారత ప్రజలకు భారత శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగం ద్వారా భారతం ప్రపంచ దేశాల సరసన నిలబెడుతుందని చెప్పారు. భారత్ ప్రజలు గర్వించదగ్గ విజయమని ఇది అందరూ ఆనందించ తగిన విషయం అన్నారు. నేను దక్షిణాఫ్రికాలో పర్యటన చేస్తున్న నా మనసు , నా ప్రాణం చంద్రయాన్ ప్రయోగం మీదనే ఉన్నదని చెప్పారు. అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. చంద్రయాన్ విజయం పట్ల శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. గర్వించదగ్గ విజయమని పేర్కొన్నారు. ఆయనతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.