
సీఎం కేసీఆర్ కు ధన్యవాదములు : ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి…
అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో పాటుగా ప్రగతి భవన్ కు వచ్చిన భాస్కర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కృతజ్ఞతా పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి తనకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదములు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో శరవేగంతో దూసుకెళ్తోందని భాస్కర్ రావు అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు ముచ్చటగా మూడోసారి తనను ఆశీర్వదిస్తారని భాస్కర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేయనున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి చైతన్యపర్చాలని భాస్కర్ రావు కోరారు.