పొట్టకూటికోసం వెళుతూ మృత్యు ఒడిలోకి…..
వేములపల్లి (ప్రజల హరి) రెక్క ఆడితేనే డొక్కాడని రోజుల్లో కూలి పని కోసం వెళుతూ మృత్యు ఒడిలోకి వెళ్ళిన ఘటన వేములపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెం శివారు రోజు కూలి పనికి వెళుతూ జీవనం సాగిస్తున్నారు. జీవనంలో భాగంగా నల్లగొండ నుంచిమిర్యాలగూడTS06EC029 అను బైక్ పై వెళ్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు వెనుక నుంచి వచ్చినటువంటి TN9JZ3739 అను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో రాధేశ్వరం రాత్రి(38) ఇతని స్వగ్రామం చతిస్గడ్. రాత్లావత్ మంగ్య(40) ఇతను స్వగ్రామం వనపర్తి లు అక్కడికక్కడే మృతి చెందారు.మరో వ్యక్తి గణపతి అపస్నారస్థితిలోకి వెళ్ళగా ఆయనకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ట్రావెల్స్ బస్సులు నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయినట్టుగా ఆయన విలేకరులకు వివరించారు.