బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..ఏడుగురు మినహా సిట్టింగులందరికీ ఛాన్స్
ప్రజాలహరి మిర్యాలగూడ
2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మారుస్తున్నామని స్పష్టం చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే ఛాన్స్ ఇచ్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు. కంటోన్మెంట్ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్ నిరాకరించినట్లు సీఎం చెప్పారు. వైరా, ఆసిఫాబాద్, బోథ్, ఉప్పల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం చెప్పారు. హుజూరాబాద్ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని సీఎం వెల్లడించారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు.
ఈసారి ఛాన్స్ దక్కని సిట్టింగులు వీరే
తాటికొండ రాజయ్య – స్టేషన్‌ఘన్‌పూర్
రేఖానాయక్ – ఖానాపూర్
చెన్నమనేని రమేష్ – వేములవాడ
గంప గోవర్ధన్ – కామారెడ్డి
రాథోడ్ బాపూరావ్ – బోథ్
ఉప్పల్ – భేతి సుభాష్‌రెడ్డి
వైర – రాములు నాయక్
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నందుకు గంపగోవర్దన్‌కు అవకాశమివ్వలేదు