Ultimate magazine theme for WordPress.

లౌకికవాదులతో కలిసి పని చేస్తాం.. జూలకంటి రంగారెడ్డి

Post top

అవకాశవాదులకు ప్రజలే బుద్ధి చెబుతారు

* మతోన్మాదం అవినీతిపరులను ఓడించాలి

* నేడు హైదరాబాదులో ఉభయ కమ్యూనిస్టు పార్టీగా పార్టీల సమావేశం

* లౌకిక పార్టీలతో కలిసి పని చేస్తా

 

విలేకరుల సమావేశంలో జూలకంటి.  మిర్యాలగూడ ప్రజాలహరి…

 

అవకాశవాదులకు ప్రజలే బుద్ధి చెప్తారని, మతోన్మాదం, అవినీతిపరులను వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు అవసరం ఉందని కెసిఆర్ వామపక్షాల సహాయం తీసుకున్నారని, అక్కడ గెలుపొందాక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వామపక్షాలను విస్మరించడం సరైనది కాదన్నారు. భవిష్యత్తులో వామపక్షాలతో కలిసి ఉంటామని చెప్పిన కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం అతని అవకాశావాదానికి నిదర్శనం అన్నారు. వామపక్ష పార్టీలకు ఓటు సీట్లు ముఖ్యం కాదని ప్రజా సమస్యల పరిష్కారమే పోరాటాలే మార్గమని చెప్పారు. మాటకు కట్టుబడి ఉండకుండా కమిట్మెంట్ లేకుండా అవకాశవాదంగా కెసిఆర్ వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నేడు హైదరాబాదులో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతలు సమావేశం జరిపి కేంద్ర కమిటీ అభిప్రాయాల మేరకు ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. కలిసి వచ్చే లౌకిక పార్టీలతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చట్టసభలో వామపక్షాల ప్రాతినిధ్యం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని దానికి అనుగుణంగానే వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కెసిఆర్ వ్యవహార శైలిపై కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు నిరుత్సాహ, బాధ అవసరం లేదని చెప్పారు. అవకాశవాద పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, భవాండ్ల పాండు,పరుశు రాములు, వరలక్ష్మి, నాగేంద్ర ప్రసాద్, పల్లా బిక్షం, వెంకట్ రెడ్డి, రామారావు, బాబు నాయక్, పాపా రావు, కోటిరెడ్డి, పథాని శ్రీను, హరి బాబు, ఏసు,పాషా తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.