ప్రజాలహరి జనరల్ డెస్క్..
అనుకున్న ప్రకారం అనుకున్న తేదీని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి తరపున అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రకటించారు .ఇందులో దాదాపుగా సిట్టింగ్లకే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల మాత్రమే మార్పులు జరిగినాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరికి మాత్రమే గేమ్ అని తమ పార్టీకి టార్గెట్ అని గెలుపే లక్ష్యంగా దూసుకుపోతామని చెప్పారు. మరోమారు తెలంగాణపై భారత రాష్ట్ర సమితి జెండాను ఎగరవేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత అభ్యర్థులపై ఎటువంటి వ్యతిరేకతలేదని పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలుకు ప్రజలు బ్రహ్మరథంపడుతున్నారని ప్రజలు చేసే ఆశీర్వచనమే తమ గెలుపుకు పునాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.