ముఖ్యమంత్రి ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి,. సూర్యాపేట ప్రజాలహరి… ఈనెల 20 తేదీన సూర్యాపేట పట్టణంలో పర్యటించనున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సభను విజయవంతం చేయడానికి జిల్లా మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గత వారం రోజులు అలుపు సొలుపు లేకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సూర్యపేట ప్రగతి నివేదన, సభలో సూర్యాపేట జిల్లాకు చేసిన సేవలు, సూర్యాపేట పట్టణాన్ని, నియోజకవర్గాన్ని జిల్లాను అభివృద్ధి చేయడానికి తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన ప్రగతి వివరాలను ప్రజలు తెలియజేయడానికి జగదీశ్ రెడ్డి సిద్ధమై ఉన్నారు .సూర్యాపేట నడిబొడ్డులో జాతీయస్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభోత్సవం, నూతన జిల్లా పరిపాలన అధికారుల సముదాయం, నల్లగొండ జిల్లాకు సూర్యాపేట జిల్లాకు తలమానికమైన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం, అదేవిధంగా సూర్యపేట తలమానికమైన చెరువు సుందరీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గరనుంచి సూర్యాపేట అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. సూర్యాపేటకు కాలేశ్వరం ప్రాజెక్టు జలాలను అందించి ఈ ప్రాంత ప్రజల, రైతుల తాగు సాగునీటి అవస్థలను పరిష్కరించనని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ విద్యాభ్యసించడం సూర్యాపేట ప్రజలకు సులువుగా ఉండే విధంగా సూర్యాపేట పట్టణానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేయించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా జిల్లాలోని వ్యవసాయ అదీకృత మార్కెట్ అయిన సూర్యాపేట మార్కెట్ ని అత్యధిక ఆధునిక హక్కులతో జాతీయస్థాయి ఇంటిగ్రేడెడ్ మార్కెట్ యార్డ్ ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వివరించారు. సూర్యాపేట సద్దల చెరువు నది జలాలతో సమృద్ధిగా నీటి సామర్థ్యాన్ని నిల్వ ఉంచి ఈ ప్రాంత ప్రజలకు ఆనందమైన వాతావరణం కల్పించే చెరువు సుందరీకరణను చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో రహదారులు విస్తరణ, మున్సిపల్ పరిధిలో పలు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.