
సర్పంచ్ గారికి ప్రజా సమస్యలు పట్టదు.
అధికారులు సర్పంచ్ కి వత్తాసు.
లబోదిబోమంటున్న గ్రామ ప్రజలు.
వేములపల్లి (ప్రజాలహరి) గ్రామంలోని ప్రజా సమస్యలు పట్టని సర్పంచ్ దీంతో సంబంధిత అధికారి సైతం సర్పంచ్ కి వత్తాసు పలుకుతూ దొందు దొందేగా సర్పంచి, గ్రామ కార్యదర్శి ఇష్టారాజ్యం గారు వ్యవహరించడంతో గ్రామ ప్రజలు లబోదిబోయమంటున్నారు. గ్రామంలో హరిజన కాలనీకి గత వారం రోజులుగా మంచినీటి రాక ప్రజలు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రజా సమస్యలు సర్పంచ్ కి చెప్పినప్పటికిని ఆయన ఏ మాత్రం పట్టించుకోకుండా పెడసేవను పెట్టడంతో, గ్రామ ప్రజలు సంబంధిత అధికారులకు చెప్పినప్పటికిని ఆయన ఏమాత్రం స్పందించకుండా నాకు సర్పంచ్ మాటే వేదం అంటూ తు, తు మంత్రంగా వ్యవహరించడంతో గ్రామ ప్రజలు ఆక్రోసానికి గురి అవుతున్నారు, ఇట్టి విషయంపై గ్రామ హరిజన ప్రజలు తక్షణమే మిర్యాలగూడ డివిజనల్ పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ప్రజా ప్రతినిధులకు సంబంధిత అధికారులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే మండల కేంద్రంలో ఉన్నటువంటి హరిజన కాలనీకి మీరు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని పలువురు వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు కోరుతున్నారు