సీఎం సభకు చక..చక ఏర్పాట్లు
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి
క్యాంపు కార్యాలయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో సమీక్ష
సభ సక్సెస్ బాధ్యత ను భుజాన వేసుకున్న ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు
ప్రజాలహరి ,సూర్యాపేట….
సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఈ నెల 20 న జరుగబోయే సీఎంపర్యటనకు చక..చక ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.సిఎం చేతుల మీదుగా ప్రారంభించ నున్న మెడికల్ కాలేజ్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, సమీకృత మార్కెట్ భవనాలు సర్వం సిద్దం అయ్యాయి.. శరవేగంగా జరుగతున్న ఏర్పాట్ల ను సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యవేక్షించారు. సమీకృత మార్కెట్ ను సందర్శించారు. అనంతరం సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సుందరీకరణ పనులను రేపటి లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్ ,సిఎం వెళ్లే రహదారుల వెంట పటిష్ట బందోబస్తుతో పాటు ఇరువైపుల చెట్లను నాటాలని ఆదేశించారు. సభా ప్రాంగణం వద్ద పార్కింగ్, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల వంటి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు.
*సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్, టిఎస్ఐఎస్సి చైర్మన్ బాలమల్లు*
సూర్యాపేట లో ఈనెల 20 న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం జరిగే ప్రగతి నివేదన సభా ప్రాంగణ ఏర్పాట్లు శరవేగంగా కాసాగుతున్నాయి. గురువారం సాయంత్రంఎమ్మెల్యే కిషోర్ కుమార్, టిఎస్ఐఎస్సి చైర్మన్ బాలమల్లు లు సభా ప్రాంగాణాన్ని పరిశీలించారు. సభ వేదికతో పాటు, ప్రజల గ్యాలరీ, పార్కింగ్, బందోబస్తు, వివిధ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వర్షం వచ్చినా సభ కు ఆటంకం లేకుండా వాటర్ ప్రూఫ్ వేదిక ను ఏర్పాటు చేస్తున్నారు.. సభ కు తరలి వచ్చే లక్ష మంది కి పైగా ప్రజల కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ తెలిపారు.