కాంగ్రెస్ ఓబిసి నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ గా నాగవెల్లి
వేములపల్లి (ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ గా వేములపల్లి మండలానికి చెందిన నాగవెల్లి కృష్ణ ను నియమిస్తున్నట్టుగా జిల్లా ప్రెసిడెంట్ పరమేష్ నియామక పత్రాన్ని మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బుధవారం నాగవెల్లి కృష్ణకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగవెల్లి కృష్ణ మాట్లాడుతూ జిల్లా నాయకులు ఇంత పెద్ద బాధ్యతను నాపై పెట్టినందుకు గాను నేను చిన్న పెద్ద అందర్నీ కలుపుకుపోయి పార్టీలకు అతీతంగా పని చేస్తానని ఆయన అన్నారు. ఇట్టి విషయాన్ని సహకరించినటువంటి వేమనపల్లి మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కురుపయ్య, మాజీ సర్పంచులు నాగవల్లి మధు, రేగటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోదుల శ్రీనివాస్ , జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాగు ఎల్లారెడ్డికి పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, నాగు నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు దైదగిరి, మాతంగి చంటి, శెట్టిపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు పల్లా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు