
సొంత ఖర్చుతో మట్టి రోడ్డు నిర్మాణం.,, ప్రజాలహరి వేములపల్లి
సొంత ఖర్చుతో మట్టి రోడ్డు నిర్మాణ పనులు చేయడం జరిగిందని పదవ వార్డ్ నెంబర్, బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పేరెల్లి నగేష్ తెలిపారు. మండలంలోని మొల్కపట్నం8
గ్రామంలో ఉపసర్పంచ్ రేమడాల కరుణాకర్ తో కలిసి రోడ్డును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మొల్కపట్నం గ్రామం నుండి గోదాము వరకు గుంతలు గా ఉన్న రోడ్డుపై ట్రాక్టర్లతో మట్టిని తరలించి గుంతలను పూడ్చి చదును చేయడం జరిగిందని అన్నారు . సుమారు పదివేల రూపాయలతో రోడ్డు పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. మరమ్మతులు చేయడంతో రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనాల రాకపోకలకు సులభతరం అయిందని అన్నారు. నడకదారులు రోడ్డుపై నడుస్తూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.