చట్టసభల్లో వామపక్షాల ప్రాతినిధ్యం అవసరం..
*రాగిరెడ్డి వీరారెడ్డి ఆశలను సాధించాలి..
వర్ధంతి సభలో జూలకంటి. మిర్యాలగూడ
ప్రజాలహరి
ప్రజా సమస్యను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వామపక్షాలు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి 42వ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం సిపిఎం కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌక్ మీదుగా హౌసింగ్ బోర్డ్ ఈదులగూడెం మండలంలోని అవంతిపురం ఆళ్లగడప రాయిని పాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వీరారెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు కార్పొరేట్ రాజకీయాలుగా మారిపోయాయని డబ్బున్నవారే పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు కరువయ్యారని, చతసభల్లో ప్రజా గళం వినిపించే నాయకుడు లేకపోవడంతో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. నిత్యం ప్రజల కోసం ఉద్యమాలు చేసే కమ్యూనిస్టు పార్టీలు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాల నాయకులు అసెంబ్లీ, పార్లమెంటులో అడుగు పెడతారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాడని దాని ఫలితంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మనుషులు, జాతులు, తెగల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని నాశనం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదవానికి భూమి ఇవ్వాలని రాగిరెడ్డి వీరారెడ్డి విరోచితమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. గ్రామంలో పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు. భూస్వాములు అతనిని పెద్దమార్చి ఉద్యమాన్ని అణగదొక్కాలని చూశారని కానీ వీరారెడ్డి చూపిన మార్గాన్ని నేడు కార్యకర్తలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆశయాలను సాధించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తున్నామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్ తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. పార్టీ నిర్మాణం కోసం నాయకత్వం విశేష కృషి చేయాలని సూచించారు. రాగి రెడ్డి వీరారెడ్డి గ్రామాల్లో పార్టీ నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆయన సేవలు మరువలేనిదన్నారు. ఆయన ఆశ సాధన కోసం కార్యకర్తలకు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, జిల్లా కమిటీ సభ్యులు బావాండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడల పరుశరాములు, వరలక్ష్మి, తిరుపతి రామ్మూర్తి, వినోద్ నాయక్,ఎండి అంజద్, సీనియర్ నాయకురాలు గాదె పద్మ, పగిదోజు రామ్మూర్తి, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన, రొండి శ్రీనివాస్, అంకె పాక సైదులు, పాపా నాయక్, ఊర్మిళ, సైదా నాయక్, నాగేంద్ర ప్రసాద్, గోవింద్ రెడ్డి, పతాని శ్రీను, మాధవరెడ్డి, పిలుట్ల సైదులు, జగన్ నాయక్, కరీమునిస్సా బేగం, అరుణ, పులమ్మ తదితరులు పాల్గొన్నారు.