
2047 నాటికి అగ్ర దేశంగా భారత్…. భారత ప్రధాని నరేంద్ర మోడీ… ప్రజాలహరి జనరల్ డెస్క్… 2047 నాటికి భారత్ అగ్ర దేశంగా నిలుస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మహాత్మా గాంధీ ఘాట్ కు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ త్రివద దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు .అనంతరం భారత మువ్వెన్నాల త్రివర్ణ పథకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికిఅనేక సేవలు అందిస్తుందని కరోనా సమయంలో ప్రపంచానికి భారత్ ఆత్మీయ మిత్ర దేశంగా నిలిచిందని వివరించారు. భారత యువత శాస్త్ర, సాంకేతిక, డిజిటల్ రంగంలో దూసుకుపోతున్నారని అగ్రభాగాన భారత్ ఉన్నదని ఆయన పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాల కోసం మరో రెండు పథకాలు త్వరలో ప్రవేశపెట్టినట్టు వివరించారు. వ్యవసాయ మరియు సొంతింటి కలలను నిజం చేయడానికి ఈ పథకాలను తీసుకొస్తామని చెప్పారు.