సినిమాల వరకే పాత్రలు నిజజీవితంలో స్నేహపూర్వకమైన జీవనం…
ప్రజాలహరి, మిర్యాలగూడ…. సినీ రంగంలో కథను బట్టి పాత్రలు వేయడం జరుగుతుందని సినిమా నటుడు కమ్మంపాటి శ్రీగిరి తెలిపారు. ఆయన త్రిపురారం పంచాయతి సెక్రటరీ స్వర్గీయ రాచూరి వెంకటేశ్వర్లు అకాల మరణం అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాలహరి ఎడిటర్ తో ముచ్చటించారు. సినిమాలో సన్నివేశాలను బట్టి కౌర్యంగా, గంభీరంగా కనిపిస్తాం తప్ప నిజ జీవితంలో స్నేహపూర్వకమైన జీవన విధానాన్ని పాటిస్తామని ఆయన చెప్పారు. భోళా శంకర్, పుష్ప టు తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికి సుమారు 150 సినిమాల్లో నటించినట్లు పేర్కొన్నారు.