ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి
వేములపల్లి (ప్రజాలహరి) మండలంలోని లక్ష్మీదేవి గూడెం గ్రామ నివాసి అని గమ్మల్ల తిరుమలేష్ ( 25) అనే వ్యక్తి శుక్రవారం తన బైక్ పై లక్ష్మీదేవి గూడెం నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా రావులపెంట గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి పడిపోయాడు. అతని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ తరలించగా అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సమీప బంధువులు తెలిపారు.