Ultimate magazine theme for WordPress.

21వ శతాబ్దం భారతదే… ప్రధానమంత్రి మోడీ

Post top

21వ శతాబ్దం భారతదే..

ప్రపంచ నవానికపై భారత్ జెండా రెపరెపలు ప్రధానమంత్రి మోడీ..

ప్రజాలహరి జనరల్ డెస్క్..

21వ శతాబ్దం భారతదే అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈరోజు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఎద్దేవా చేశారు. వారు ఐక్యతను చాటుకోవడానికి ఈ అవిశ్వాస తీర్మానం అని గతంలో మూడు పర్యాయాలు తమ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టారని అవి వీగిపోయాయని పేర్కొన్నారు. వారు ప్రజల మద్దతును కోల్పోతున్నారని పేర్కొన్నారు మణిపూర్ సంఘటనలో ప్రతిపక్షాలు లోతుగా చర్చించి సమస్య పరిష్కారానికి మార్గాలు సూచనలు చేయకుండా ఆ సంఘటన తమకు రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలకు దేశం అస్థిరపరచడం ఘర్షణలు ,హింస సృష్టించటం పనిగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మణిపూర్ లో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని చెప్పారు .కోర్టు తీర్పు కారణంగానే అక్కడ హింసలు జరుగుతుందని త్వరలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. ప్రతి పక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వారిసభ్యులు ఓట్లు వేయకుండా వాక్ అవుట్ చేశారని వివరించారు. ప్రజా సమతము పొందని నేత రాహుల్ గాంధీని ఎన్నిసార్లు ప్రజల్లోకి తీసుకు వెళ్లిన ఓట్లు , సీట్లు పెరగవని తెలిపారు. ప్రతిపక్షాల అవిశ్వాసం వల్ల తమ పార్టీకి మెజార్టీ సీట్లు పెరుగుతున్నాయని మోడీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇప్పటికంటే ఎక్కువ సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.