వరద బాధితులను ఆదుకోవాలి..
* మిర్యాలగూడలో విరాళాలు సేకరించిన జూలకంటి. మిర్యాలగూడ… ప్రజాలహరి
వరద బాధితులకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీతల వల్ల ఎంతో మంది పేద ప్రజలు అభాగ్యులయ్యారని, ఇండ్లు, సామాగ్రి అంతా కోల్పోయి అనాధలుగా మిగిలియారన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు తోచిన విధంగా వరద బాధితులకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా నాయకులు రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడాల పరుశురాములు, వరలక్ష్మి, గోవర్ధనమ్మ,తిరుపతి రామ్మూర్తి, పాల్వాయి రాం రెడ్డి, దేశిరం నాయక్, లక్ష్మీనారాయణ,కోడైరెక్క మల్లయ్య, బాబు నాయక్, సైదా నాయక్, చెనగని యాదగిరి, వున్నాం వెంకటేశ్వర్లు, రామారావు, యేసు, నాగేందర్,మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.