Ultimate magazine theme for WordPress.

వరంగల్ కాంగ్రెస్ సభకు భయపడే రైతు రుణమాఫీ అమలు చేసిన కేసీఆర్… బిఎల్ఆర్

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి.  …..   మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో శ్రీ రాహుల్ గాంధీ కి పాలాభిషేకం చేయడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ ఆర్  మాట్లాడుతూ వరంగల్ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీకి భయపడి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ గురించి ప్రకటన చేశారని రైతు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తామని ఇచ్చిన హామీని గత నాలుగు సంవత్సరాలుగా ఎందుకు చేయటం లేదని బెదిరించడంతో ఎలక్షన్ల ముందు హడావిడిగా ఇప్పుడు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఉధృతమైన కార్యక్రమాలు చేస్తుందని భయపడి కెసిఆర్ వెంటనే రైతు రుణమాఫీ నీ అమలు చేయాలని నిన్నటి క్యాబినెట్ మీటింగ్ లో తీర్మానం చేశారని దీనికంతటికి కారణభూతులైన రాహుల్ గాంధీ కి అందరం రుణపడి ఉంటామని అందుకే వారికి ఈరోజు పాలాభిషేకం చేశామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షమే అనే విషయాన్ని మల్లొకసారి రుజువు చేసుకుందని రైతు రుణమాఫీ అనేది ముమ్మాటికీ ఇది కాంగ్రెస్ పార్టీ విజయమేనని ఇకపై కేసీఆర్ మాయ మాటలు కల్లబొల్లి కబుర్లు విని ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో 100 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వారన్నారు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సరైన సమయంలో రుణమాఫీ చేసినట్లయితే రైతు ఆత్మహత్యలు కొన్ని అయినా తగ్గేవని ఇప్పటికీ వారు తెచ్చుకున్న అప్పుకు వడ్డీ రెట్టింపు అయిందని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు భయపడి కెసిఆర్ రైతు రుణమాఫీ చేసినందుకు సంతోషిస్తున్నామని ఇకపై గులాబీ పార్టీ చెప్పే కల్లబొల్లి కబుర్లను రైతులు నమ్మే పరిస్థితిలో లేరని అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసుకున్నారని అది మరొక కాళేశ్వరం ప్రాజెక్టు కానుందని ఇక పోతే మిర్యాలగూడ నియోజకవర్గంలో భాస్కరరావు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లని బీసీ బందులని దళిత బంధులని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆ పథకాలన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని రాబోయే శాసనసభ ఎన్నికల్లో భాస్కర్ రావుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీని ఘన మెజార్టీతో గెలిపిస్తారని వారన్నారు

ఈ కార్యక్రమంలో వేములపల్లి ఎంపీపీ సునీత కృపయ్య డిసిసి జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిళ్ల శ్రీను అర్జున్ పగిడి రామలింగయ్య, సర్పంచ్ కిరణ్, బెజ్జం సాయి, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, మంత్రాల రుణాల్ రెడ్డి, రవి నాయక్, క్రికెటర్ జానీ, గంధం రామకృష్ణ,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు హజార్ ఎంపీటీసీ ఇజ్రాయిల్ మాజీ ఎంపీపీ జిందా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశం నరసింహారెడ్డి, గాలం వెంకన్న యాదవ్, నాగునాయక్, సిద్దు నాయక్ కోడిరెక్క ఇంద్ర కుమార్ చల్లా వెంకన్న వెంకటేష్ గౌడ్ పందిరి కృష్ణ రవీందర్ రెడ్డి, పాతూరు ప్రసాద్, ఎల్లారెడ్డి బల్గురు శ్రీను పాతూరు ప్రసాద్ ఉబ్బపల్లి కాశయ్య అబ్దుల్లా పర్వేజ్ ఖాన్ మస్తాన్ పసుపులేటి శేఖర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.