పాఠశాలలో పార్కు అనుకోకండి
పిచ్చి మొక్కలతో కనిపిస్తున్న పాఠశాల
వేములపల్లి (ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ని వేములపల్లి మండల పరిధిలోగల, సల్గునూరు గ్రామంలోని హరిజనవాడ పాఠశాలలో పిచ్చి మొక్కలతో కనిపిస్తున్న పాఠశాల, ఆ గ్రామంలోని పిల్లలు ఆ పాఠశాలకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురి అవుతున్నారు. పాఠశాలలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఇటీవల కాలంలో పాములు కనిపించడంతో పిల్లలు భయభ్రాంతులకు గురై అటువైపు వెళ్లాలంటేనే ప్రాణాలు హరి చేతిలో పెట్టుకొని నడుస్తున్నారు. అంతేకాకుండా అట్టి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఇంటిదగ్గర తల్లిదండ్రులను మేము ఈ బడికి వెళ్ళమని మొరాయిస్తున్నారు, ప్రతినిత్యం బడికి పోయే పిల్లలు ఇప్పుడు బడికి పోవాలంటే ఎందుకు పోతలేరని తల్లిదండ్రులు ఆరా తీయగా అట్టి పాఠశాలలో పార్కు లాగా తయారైనటువంటి పిచ్చి మొక్కలు అట్టి పాఠశాలలో నీ పిల్లలకు పాములు, జెర్రీలు, తేలు కనిపిస్తున్నాయని పిల్లలు తల్లిదండ్రుల దగ్గర వాపోతున్నారు. ఇట్టి విషయంపై తల్లిదండ్రులు సంబంధిత పాఠశాల పంతులను పిచ్చి మొక్కల గురించి సంబంధిత పంతులను అడగగా వారి దగ్గర ఎలాంటి సమాధానం లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికిని తక్షణమే సంబంధిత విద్యాశాఖ అధికారులతో చొరవ తీసుకొని ఆ పాఠశాలలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించి గ్రామంలోని పిల్లలు పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు
హెచ్ఎం వివరణ
తక్షణమే పిచ్చి మొక్కలను తొలగించే ప్రయత్నం చేస్తానని సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ అన్నారు