Ultimate magazine theme for WordPress.

ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ జిల్లాలోని టాప్

left home Post top

అత్యుత్తమ ఫలితాలతో నల్గొండ జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు …

 

ప్రజలందరి మన్ననలు పొందుతున్న ఏకైక విద్యాసంస్థలు”కేఎల్ఎన్”…

(ప్రజాలహరి, మిర్యాలగూడ:)

ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన “కేఎల్ఎన్” జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటి అన్ని గ్రూపులలో అగ్రగామిగా నిలిచారు. దీంతో పాటు గా ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ లో సిహెచ్ పవన్ కుమార్ (2350110838) 467/470 “స్టేట్ ఫస్ట్ మార్కు”తో సత్తా చాటారు. “కేఎల్ఎన్” జూనియర్ కళాశాల విద్యాసంస్థలు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు 16 ఏళ్లలో ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ప్రతిసారి జిల్లా, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్టేట్ మార్కులు సాధించి విద్యార్థుల తల్లిదండ్రుల, ప్రజల అందరి మన్ననలు పొందుతున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ లో జి. హస్మిత (2350108982) 464/470 మార్కులు సాధించగా బి చరిత (2350110329) 463/470 మార్కులు, ఈ. ప్రణీత (2350120876) 461 మార్పులు, బైపిసి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పి సంజన (2350110765) 432/440 మార్కులు సాధించగా, ఎస్.కె సమీర్ 429 మార్కులతో జిల్లాలో టాప్ స్థానం, బైపిసి రెండవ విద్యా సంవత్సరంలో సాధించారని కళాశాల యాజమాన్యం పేర్కొన్నారు. ఎం శ్రీజ (2350208492) 991/1000 మార్కులతో మిర్యాలగూడ టౌన్ ఫస్ట్, జై వర్ష (2350208490) 989 మార్కులు, ఆర్ అఖిల (2350209552) 987 మార్కులు, ఈ. జ్యోతి (2350209717) 983 మార్కులు సాధించగా బైపీసీలో వి పూజ శ్రీ (2350210393) 987 మార్కులతో మిర్యాలగూడ టౌన్ ఫస్ట్ సాధించగా బి మేఘన (2350209640) 987 మార్కులు, ఆర్ అక్షయ (2350220414) 985 మార్కులు,పి. హేమశ్రీ (2350209679) 980 మార్కులతో మిర్యాలగూడ పట్టణంలోనే అగ్రగామిగా కే ఎల్ ఎన్ కళాశాల విద్యార్థులు నిలిచారు. కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఐఐటి నీట్ తో పాటు ఇంటర్ లో స్టేట్ ర్యాంకు సాధిస్తున్న ఏకైక కళాశాల కె.ఎల్.ఎన్ అని కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, పి. హనుమంత రెడ్డి, పిఎల్ఎన్ రెడ్డి తెలిపారు. ప్రకటించిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర స్టేట్ మార్కు సాధించిన విద్యార్థి పవన్ కుమార్ తోపాటు జిల్లా, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.మిఠాయిలు తినిపించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.