ప్రేమే దైవం…సేవే మార్గం
నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ఆస్పత్రి ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి…
“సేవా థృక్పథంతో సొంత ఊరిపై మమకారంతో, తాను పుట్టిన నియోజకవర్గ ప్రజలకు తన వంతుగా వైద్య సేవల్లో సాయం అందించాలనే సంకల్పంతో నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ఫౌండేషన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆస్పత్రి ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉన్నది.” అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని కొత్తగూడెం గ్రామంలో నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఆస్పత్రిని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో ఆస్పత్రి ప్రారంభించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, ట్రస్టు నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.