అంగన్వాడి కేంద్రంలో స్వాపరిపాలన దినోత్సవ వేడుకలు
ప్రజాలహరి మిర్యాలగూడ
. వేములపల్లి మండలం రావులపెంట గ్రామ అంగన్వాడి కేంద్రంలో బుధవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ శీలం శారద మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగన్వాడి కేంద్రంలో స్వపరిపాలన దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల లక్ష్యాలు ఏర్పడతాయని అన్నారు. అంగన్వాడీ పీడీగా జేరిపోతుల ప్రణవి, ఆశ వర్కర్ గా ధరణి, పిడిఓగా శ్రీవల్లి, ఆయాగా మనిచంద్రిక, సూపర్వైజర్ గా సిద్ధిగా, టీచరుగా ఇసుక తేజశ్రీ, గర్భిణిగా జాహ్నవి ఇలా చిన్నారులు వివిధ పాత్రలో పోషించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శారద, ఆయా అనిత, జరిపోతుల రావులమ్మ, శీలం సాయిదమ్మ, శీలం సుమన్, జర్నలిస్ట్ వినయ్ గౌడ్, చిన్నారుల తల్లిదండ్రులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు
