విశాఖ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజాలహరి జనరల్ డెస్క్..
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం అని త్వరలో అక్కడినుంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆయన ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మెట్ సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి మూడు నాలుగు తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలోని జరుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా త్వరలో పూర్తిస్థాయిలో విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగిస్తామని ముందుగా తాను వెళుతున్నానని ప్రకటించారు. అదేవిధంగా ప్రజలు అందరూ పెట్టుబడిదారులు విశాఖపట్నం తరలి రావాల్సిందిగా కోరారు. జాతీయంగా అంతర్జాతీయంగా విశాఖపట్నం పెట్టుబడులకు అలావాలమని పేర్కొన్నారు తమ నిర్ణయానికి అన్ని వర్గాలు సహకరించాలని కోరారు