జిల్లా ఆసుపత్రిలోని సదరం కార్యాలయం వద్ద వైద్య నిర్ధారణ పరీక్షలకు దివ్యాంగులు తప్పనిసరిగా హాజరు కావాలి :- మెప్మా
ప్రజాలహరి, మిర్యాలగూడ , జనవరి 16:
నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మరియు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దివ్యాంగులందరూ సదరం స్లాట్ బుకింగ్ గాను శారీరక వైకల్యం కలిగిన దివ్యాంగులకు 2023లో జనవరి నెలలో 19,24,31 తేదీలలో మరియు మీసేవ రసీదులో తెలపబడిన సమయానికి జిల్లా ఆస్పత్రి నల్గొండ లోని సదరం కార్యాలయం వద్ద నిర్వహించు వైద్య నిర్ధారణ పరీక్షలకు తప్పనిసరిగా హాజరయ్యి దివ్యాంగులు వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డి ఆర్ డి ఓ, డి ఆర్ డి ఏ అధికారి మెప్మా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.