మూలాలు మరవద్దు భారత రాష్ట్రపతి
.. (ప్రజాలహరి జనరల్ డెస్క్) మనము ఎంత ఎత్తు ఎదిగిన మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే మూలాలను మాత్రం మరవద్దని భారత రాష్ట్రపతి ద్రౌపతి మురుము అన్నారు. ఈరోజు హైదరాబాదులోని నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ముఖాముఖిగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మనము వెనుకబడిన కింద స్థాయి నుంచి వచ్చిన ప్రాంతాలైన విషయాన్ని మనసులో ఉంచుకోవద్దని విద్యలో రాణించాలని కోరారు. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు. మన గ్రామాలను గ్రామదేవతలు కాపాడుతూ వస్తున్నారని అదే విధంగా మనము మన గ్రామాల్లో అత్యున్నత స్థాయి శిఖరాలకు చేరుకుని గ్రామాలకు రక్షణగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ మాట్లాడుతూ విద్యార్థులు అంకితభావం విద్య పట్ల నిశితమైన సున్నితమైన దృష్టి సారించి తమకు తామే సాటే అని నిరూపించుకోవాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని కోరారు.