మిర్యాలగూడ కు హైదరాబాదు స్థాయి గల హాస్పిటల్ రావడం సంతోషకరమని మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కోర్ర విష్ణు(కోటేశ్వరరావు) పేర్కొన్నారు. ఈ సందర్భంలో వారు వార్డుల వారీగా ఉచిత సేవ చేయడం చాలా ఆనందమయం అని మున్సిపల్ వైస్ చైర్మన్ చెప్పారు. శనివారం అపోలో రీచ్ హాస్పిటల్-మిర్యాలగూడ ఆధ్వర్యంలో మున్సిపల్ వార్డులు 29,30,31 కలిపి స్థానిక మైత్రీ గ్రౌండ్ లో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది .మున్సిపల్ వైస్ చైర్మన్ కొర్రా కోటేశ్వరరావు ( విష్ణు) ప్రారంబిస్తూ,ఉచిత వైద్య సేవలను అందరూ వినియోగించుకోవావనీ అన్నారు.30 వ వార్డు కౌన్సిలర్ చైతన్య కూడా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ వైద్యులు భరత్,విజేందర్, మురళీకృష్ణ, అడ్మినిస్ట్రేటర్ గోపికృష్ణ, మేనేజర్ ప్రమోద్ ఆవంచ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
