మిర్యాలగూడ ప్రజాలహరి… ఈనెల22వ తేదీన హైదరాబాదులోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో సీనియర్ జర్నలిస్టు, రిటైర్డ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ,,రచయిత వాకిటి మధు రచించిన” సమాజానికి స్నేహహాస్తం” అనే పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి చేతుల మీదుగా ఆవిష్కరించబడనని ఓ ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా భాషా సంస్కృతి శాఖ సహకారంతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్టు రచయిత మధు తెలిపారు. విశిష్ట అతిధులుగా తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ప్రెస్ అకాడమీచైర్మన్ అల్లం నారాయణ,
తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి బాలకృష్ణ, రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ వై బాబ్జి , పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా పూర్వ అధ్యక్షులు డాక్టర్ జుర్రు చెన్నయ్య, పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి , కార్యదర్శి మోహన్ రావు తదితరులు హాజరవుతారన్నారు