Ultimate magazine theme for WordPress.

ఆక్సిజన్ పార్కు ప్రారంభించిన మంత్రి

left home Post top

ఆక్సిజన్ పార్క్ ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

 

ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్ పార్క్ ను ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఓయూ వీసీ ఆచార్య డి. రవీందర్ సహా రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సిజన్ పార్క్ లో ఆయన కలియ తిరిగారు. ఈ సందర్భంగా మొమిన్ చెరువు అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కల్పనపై ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రొఫెసర్ రవీందర్ వివరించారు. సమగ్ర నివేదిక( డీపీఆర్) తో వస్తే ఆక్సిజన్ పార్క్ సహా ఉస్మానియా ఆవరణలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తానని ఈ సందర్భంగా వీసీకి ఎంపీ హామీ ఇచ్చారు. అటు 200 రకాల ఔషధ మొక్కలు, చెట్లతో ఆక్సిజన్ పార్క్ ను అభివృద్ధి చేశామని వీసీ చెప్పారు. వెయ్యికి పైగా నెమళ్లు ఈ పార్క్ లో ఉన్నాయని..వాటి సంరక్షణతో పాటు బయోడైవర్సిటీకి ఓయూ కేంద్రంగా ఉందన్నారు. అటు ఓజోన్ డే సందర్భంగా ఓజోన్ పార్క్ ముందు ఎంపీ సంతోష్, వీసీ, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్ మొక్కలు నాటారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.