శబాష్..
* నీలం మధు ముదిరాజ్
* మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు
* నేనున్నా.. గోహెడ్ బేటా
* అసెంబ్లీలో కేటీఆర్ ను కలిసిన చిట్కుల్ సర్పంచ్
* బాగా పనిచేస్తున్నావని ప్రశ్నంసలు
శబాష్ బేటా నీలం మధు ముదిరాజ్..
అంతా మంచిదేనా…అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చిట్కుల్ సర్పంచ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మధును ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం మధు తన సన్నిహితులతో కలిసి అసెంబ్లీ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఆ సందర్బంగా పూలబోకే అందించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో ఈ నెల 26న ఏర్పాటు చేయనున్న ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ను నీలం మధు ఆహ్వనించారు. తప్పకుండ విగ్రహ ఆవిష్కరణకు హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఏం నడుస్తుంది..అంతా మంచిదేనా..? నేనున్నా గోహెడ్ బేటా అని మధు ను కేటీఆర్ బుజం తడుతూ యేగక్షేమాలు తెలుసుకున్నారు. పార్టీ కోసం బాగా పనిచేస్తున్నావని, కీపిటప్ అంటూ మధును ప్రోత్సహించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న మీలాంటి యువత ఆదర్శమని కేటీఆర్ అభినందించారు. మీ అశీస్సులు, మీ అభిమానంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని నీలం మధు కేటీఆర్ తో సంతోషంగా అన్నారు. జాతీయ రజకసంఘాల కో ఆర్డినేటర్ మల్లేష్ కుమార్, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు, రజక సంఘం యూత్ అధ్యక్షుడు నల్లతీగల రాజు, కార్యదర్శి చాకలి వెంకటేష్,తదితరులు ఉన్నారు.