సోనియాగాంధీ ఇంట్లో తీవ్ర విషాదం.. సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు సోనియా గాంధీ వెళ్లనున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలోనే.. ఇలా తల్లి మరణించటం శోచనీయం. సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో ఆగస్టు 27వ తేదీ (శనివారం) మృతి చెందినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు.
పాలోవా మయానో అంత్యక్రియలు ఆగస్టు 30వ తేదీన ముగిసినట్లు జైరాం రమేశ్ తెలిపారు. అయితే సోనియా గాంధీ మాతృమూర్తి పోలా మినో మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తల్లిని కోల్పోయిన సోనియా గాంధీకి, వారి కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.