Ultimate magazine theme for WordPress.

ముసా అలీ ఖాన్ కు అవార్డులు పరంపర

Post top

ఒకే రోజు వేర్వేరు వేదికలపై

మూసా అలీఖాన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారాలు

 

మిర్యాలగూడ : నటుడు, సామాజిక సేవకుడు మిర్యాలగూడ వాసి మూసా అలీఖాన్‌ ఒకే రోజు రెండు వేర్వేరు వేదికలపై ప్రముఖుల చేతుల మీదుగా రెండు అవార్డులను అందుకున్నారు. సినీ రంగంలో తాను స్వయం కృషి తో ఎదుగుతూ, ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా పేద కళాకారుల కోసం పరితపించే నటుడిగా మూసా అలీఖాన్‌కు మంచి పేరుంది. సామాజిక సేవల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుతున్నారు. నిత్యం ఎంతో మంది సినీ సామాజిక సేవా ప్రముఖులతో ఆత్మీయునిగా మెలిగే మూసా అలీఖాన్‌కు రెండు ప్రధాన సంస్థలు తమ అవార్డులను ఒకే రోజు ప్రదానం చేసి ఆయన సేవలను కొనియాడాయి. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమంలో ఎపిఎ డిజిటల్‌ అవార్డు 2022 పేరిట ఆ సంస్థ నిర్వాహకుడు, నటుడు అభినవ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మూసా అలీఖాన్‌కు ప్రతిష్టాత్మకమైన అవార్డును అందించి సత్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె, సెవెన్‌హిల్స్‌ సతీష్‌, యూ మీడియా అధినేత కల్యాణ్‌ సుంకర, శ్రీని ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ అధినేత జి.శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో అభినవ్‌ ఈ అవార్డును మూసా అలీఖాన్‌కు ప్రదానం చేసి, ఆయన సేవలను ప్రశంసించారు.

అదే విధంగా ఆర్‌కె కళా సాంస్కృతిక సేవా సంస్థ అధినేత డాక్టర్‌ రంజిత్‌ ఆధ్వర్యంలో ప్రముఖ హీరో సుమన్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో అవార్డుల ప్రదానం జరిగింది. నటుడు, నిర్మాత, సామాజిక సేవకుడు మూసా అలీఖాన్‌కు సేవా పురస్కారాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా మూసా అలీఖాన్‌ మాట్లాడుతూ నిత్యం ఎంతో మంది సామాజిక సేవకులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తున్న డాక్టర్‌ రంజిత్‌ కుమార్‌ కృషిని అభినందించారు. ఒకే రోజు రెండు వేర్వేరు వేదికలపై అవార్డులు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. త్వరలో తాను ఒక ట్రస్టును ఏర్పాటు చేసి పేద కళాకారుల సంక్షేమానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.