మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి సహకరించాలి:- హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డికి జిల్లా సాధన సమితి నేతల విజ్ఞప్తి
అన్ని వనరులు,భౌగోళిక స్వరూపం, జిల్లా ఏర్పాటుకు అవకాశాలు ఉన్న మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సహకరించాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నేతలు సోమవారం హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిని కలిసి నేరేడుచర్ల లో కోరారు. జిల్లా ఏర్పాటు ఉద్యమ కార్యాచరణలో భాగంగా మిర్యాలగూడ నాగార్జునసాగర్ హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ్యులకు కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్న తరుణంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించగా తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. మిర్యాలగూడ నాగార్జునసాగర్ నియోజకవర్గాలతో కలిపి మిర్యాలగూడ జిల్లా చేస్తే బాగుంటుందని తాము సహకరిస్తామని అన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే అది జరుగుతుందని దానికి ప్రభుత్వాలు అంగీకరించాల్సిందేనని అన్నారు. జిల్లా ఏర్పాటు విషయంలో ప్రజల ఆకాంక్ష వాస్తవమేనని అన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో జిల్లా సాధన సమితి నేతలు,బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, BSP మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి నాగేశ్వరరావు బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు,యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, ఎంఐఎం జిల్లా కార్యదర్శి ఫారుక్, సామాజికవేత్త రుషికేశ్వర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.