Ultimate magazine theme for WordPress.

సింగరేణిని దోచుకోవాలని మోడీ ప్రయత్నిస్తున్నారు ..కేసీఆర్

Post top

సింగరేణిని లాక్కోవాలని చూస్తున్న మోడీ తెలంగాణ యావత్త ప్రజానీకం మోడీని వ్యతిరేకించాలి… కెసిఆర్.. ప్రజాలహరి.. ఏనాడైనా ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో లభించే భూ ఖనిజ సంపద నే ఆ రాష్ట్రాల అభివృద్ధికి మార్గదర్శకమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. అటువంటి ఖనిజ సంపద అయిన తెలంగాణ నల్ల బంగారం దోచుకుని ప్రైవేటీకరణ చేయాలని మోడీ చూస్తున్నారని యావత్ తెలంగాణ ప్రజానీకం మోడీని, బిజెపిని నాయకులను ఎదుర్కొని ఎండగట్టాలని ఘాటుగా విమర్శించారు. ఆనాడు పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో మన నల్ల బంగారం ని అక్రమంగా తరలించకపోయారని ఇప్పుడు మోడీ ప్రైవేటీకరణ పేరుతో దోపిడీ చేయడానికి చట్టాలని మారుస్తున్నారని ఇటువంటి కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఎండగట్టాలని ప్రజలను కోరారు. ఈరోజు పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చేరిగారు . గుజరాత్ లో గాంధీ నడయాడిన స్థలమని అటువంటి పుణ్యభూమిలో కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అయినా మోడీ చల్లించలేదని పెట్టుబడిదారులకు అధికారం అప్పజెప్పి చేష్టలు వుడిగినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నో కలలు సాకారం చేసుకుందామని లక్ష్యంగా తెలంగాణ సాధించుకున్నామని అటువంటి తెలంగాణలో అధికారం కోసం బిజెపి నాయకులు కుట్టలు కుతంత్రాలు చేస్తూ అడ్డదారుల్లో రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కులము, మతము, వర్ణము, వర్గం, పేరిట విభజిస్తూ చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎంతవరకైనా వెళ్తామని ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. 8 సంవత్సరాల పాలనలో రైతుల కోసం, ప్రజల కోసము అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ విఫలం చెందలేదని ఆయన అన్నారు కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛాయిత వాతావరణo లొ జీవనం సాగించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని లేని పక్షంలో విద్యుత్ సరఫరా చేయనని నోటీసులు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు.

25 రాష్ట్రాలకు చెందిన రైతులు తో కలిసి మాట్లాడానని రైతు వ్యతిరేక విధానాల ఎండగట్టాలని వారు కోరారని అన్నారు. పెద్దపెల్లి కలెక్టర్ భవనాన్ని ఆయన ప్రారంభించి సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ,సుల్తానాబాద్, మంథని, గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.