
పేద ప్రజల సంక్షేమమే మా లక్ష్యం ఎమ్మెల్యే భాస్కరరావు… ప్రజాలహరి… తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ వరప్రదాయిని ఆసరా పథకం కింద 1340 మందికి మంజురైన పెన్షన్ కార్డులను గౌరవ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు లబ్దిదారులకు పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల కాలములో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అనేక సంక్షేమ పతకాలు ప్రవేసపెత్తారని తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికిప్ పెన్షన్ లను ఇస్తున్నామని ఎవరికైనా సాంకేతిక కారణాలచే రాకపోతే అవి కూడా ఇప్పిస్తానని, తెలంగాణా రాష్ట్రo రాక మునుపు కేవలం 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వారని కాని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నేతృత్వంలో ఇప్పుడు 2016 రూపాయలు ఇస్తున్నామని.. కాబట్టి రానున్న కాలములో మరిన్ని సంక్షేమ పథకాలు రావాలనే cm కెసిఆర్ గారికి అండగా నిలవాలని తెలిపారు. కార్యక్రమములో DCMS వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి,MPP ధీరావత్ నందిని రవితేజ, ZPTC అంగోతు లలిత హాతిరాం నాయక్, రైతు బంధు జిల్లా కమిటి మెంబర్ వీరకోటి రెడ్డి, మాజీ AMC వైస్ చైర్మన్ మేగ్యా నాయక్, వైస్ MPP కటికం సైదులు రెడ్డి, మండల పార్టి ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, యూసఫ్ ,పడిగేపాటి పెద్ద కోటి రెడ్డి, సర్పంచ్ లు, MPTC లు, MDO కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.