మిర్యాలగూడ జిల్లా కోసం ముఖ్యమంత్రికి నివేదిస్తా:- నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్
మిర్యాలగూడ జిల్లా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి లేక ఇస్తానని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో త్రిపురారం మండలంలోని బాబుసాయిపేటలో ఎమ్మెల్యే భగత్ కు వినతి పత్రం సమర్పించారు. మిర్యాలగూడ,నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన జిల్లా ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. జిల్లా ఏర్పాటుకు దేవరకొండ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుందని అన్నారు. అయినప్పటికీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తానని జిల్లా ఏర్పాటు కోసం తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ఏర్పాటు సమస్యను ముఖ్యమంత్రికి నివేదించి జిల్లా సాధన కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భూతల నరేందర్, త్రిపురారం సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, అనంతరెడ్డి బాబు సాయి పేట సర్పంచ్ శ్రవణ్ కుమార్, కొనకంచి సత్యనారాయణ, జిల్లా సాధన సమితి నాయకులు మాలోతు దశరధ నాయక్, ఉద్యోగ సంఘ నాయకులు కోటయ్య వెంకయ్య యాదవ్ శ్రీనివాస్ సాధన సమితి నాయకులు రిషికేశ్వర్ రాజు బంటు వెంకటేశ్వర్లు చేగొండి మురళి యాదవ్ జయరాజు ఫారుక్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.