*కమ్యూనిస్టు జీవనమే ఉన్నతమైన జీవనం* *సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ కంచర్ల కోటిరెడ్డి గారి విగ్రహావిష్కరణ మరియు ప్రథమ వర్ధంతి సభ*లో జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు*. మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ కంచర్ల కోటిరెడ్డి గారి ప్రథమ వర్ధంతి సభ మరియు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ కంచర్ల కోటిరెడ్డి కడవరకు కమ్యూనిస్టు గానే జీవించి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక ప్రజా ఉద్యమాలు పాల్గొని , పేద ప్రజానీకానికి హక్కుల కోసం జరిగే ఉద్యమాలను ముందుండి నడిపాడని, చొక్కాలు మార్చినట్టు రాజకీయాలు మార్చే ఈ రోజులలో కమ్యూనిస్టు పార్టీ కోసం జీవించిన కోటిరెడ్డి గారిని నేటి తరం యువకులు ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. పార్టీ శాఖ నే కాకుండా కుటుంబాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దిన కోటి రెడ్డి గారు ఉన్నతమైన వ్యక్తి అని వారు కొనియాడారు. జీవించి ఉన్నప్పుడే తల్లిదండ్రులను మరిచిపోయే నేటి రోజులలో వారిద్దరు కుమారులు కుమార్తె వారి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఆ కుటుంబం కూడా కోటిరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారు మల్లేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్, కోటిరెడ్డి గారి సతీమణి లలితమ్మ, పెద్ద కుమారుడు రామకృష్ణారెడ్డి, చిన్న కుమారుడు సంతోష రెడ్డి,, సిపిఎం జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి రాగిరెడ్డి మంగారెడ్డి, బావండ్ల పాండు, వినోద్ నాయక్, సిపిఎం శాఖ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ రెడ్డి, సిపిఎం సీనియర్ నాయకులు నంద్యాల కృపాకర్ రెడ్డి, సత్యనారాయణరావు కందుకూరి రమేష్, గాదే పద్మమ్మ, పాతూరి గోవర్ధన,కరిమున్నీసా,, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.