మోదీ కు హిట్లర్ కు పట్టిన గతే…
* ఒకే ప్రభుత్వం ఉండాలన్న కుట్ర…
* ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి…
విలేకరుల సమావేశంలో జూలకంటి…
ప్రపంచాన్ని ఏలాలనుకున్న హిట్లర్ చివరికి ప్రజా వ్యతిరేకతను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చివరికి ప్రధాని నరేంద్ర మోడీకి అదే గతి పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకే దేశం ఒకే మతం ఒకే ప్రభుత్వం ఉండాలని బిజెపి ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే బిజెపిఏతారా రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలను కులదాన్ని తమ పార్టీ ప్రభుత్వం ఉండే విధంగా కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఝార్ఖండ్ ఢిల్లీ రాష్ట్రాలలో ఈ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల నాయకులను డబ్బుతో కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి పదవుల పేరిట ఆశ చూపి తమ పార్టీ ప్రభుత్వం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మాట వినకపోతే సిబిఐ, ఈడి, ఈసీ ప్రభుత్వ సంస్థల ద్వారా బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్కు సిఫారస్ చేయడం దేశ చరిత్రలో మొదటిదని చెప్పారు. దేశం మొత్తాన్ని ఒక్కడే అమ్మాలని మోడీ చూస్తున్నాడని ఎమర్జెన్సీకి తలపించే విధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మతోన్మాదం పేరిట ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని బిజెపి ప్రయత్నిస్తుందని అన్నారు. మతోన్మాదం వలన సమాజానికి ప్రమాదకరమని చెప్పారు. పేదలపై భారాలు మోపుతూ, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులు బిజెపి ఆగడాలను ఖండించి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రవి నాయక్, భావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజాద్ తదితరులు పాల్గొన్నారు.