ప్రజల సంక్షేమమే కేసీఆర్ కు ప్రధానం : మంత్రి జగదీష్ రెడ్డి…
తెలంగాణ ప్రజల సంక్షేమానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఐతే కొన్ని విద్వేష శక్తులు మాత్రం ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. శనివారం సూర్యాపేటలో కొత్తగా నమోదు చేయించుకున్న వారికి ఆయన ఫించన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుంటే బీజేపీ మాత్రం మత కల్లోలాలను సృష్టించాలని చూస్తుందని విమర్శించారు. ప్రజలంతా వారి కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.