Ultimate magazine theme for WordPress.

ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలి

Post top

ప్రజాలహరి..వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఇవ్వవలసిన పెన్షన్లను ఐడీలను ఇంటింటికి తిరిగి ఇచ్చి ఉంటే బాగుండేదని మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. వృద్ధులను వికలాంగులను అంత దూరం ఇబ్బందులతో అంత దూరం పిలిపించి చేసిన ఉపన్యాసంలో ఎమ్మెల్యే పూర్తిగా మిర్యాలగూడ ప్రాంత అభివృద్ధి విషయంలో విఫలమైన విషయాన్ని భాస్కర రావు గారే ప్రతి విషయంలో విఫలమైనట్టుగా అన్ని అసంపూర్తిగానే ఉన్నట్లుగా ఒప్పుకున్నారు. అన్ని పెన్షన్లు కూడా పోస్ట్ ఆఫీస్ లోనే గతంలో మాదిరిగానే అనే విషయాన్ని అందరి అధికారులు చెబుతున్నారు భాస్కర్ రావు మీ ఖాతాలో నే డబ్బులు ఉంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే విషయం గందరగోళంగా ఉన్నది కావున ప్రజలకి సరైన సమాచార ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. భాస్కర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ గారు పెన్షన్లను కేసీఆర్ ఇంటి నుంచే ఇస్తున్నాడు అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ పేద ప్రజలే కేసీఆర్ నెలకు నాలుగు లక్షల రూపాయల జీతం ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు! గుర్తుంచుకోవాలి. ప్రజలు పన్నుల రూపంగా కట్టే డబ్బు నుంచే పెన్షన్స్ ఇస్తున్న అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాం. భాస్కర్ రావు పూర్తిగా అన్ని విషయాలలో విఫలమైనట్టుగా అభివృద్ధిలో అన్ని పనులు పూర్తికానట్టుగా అన్ని అసంపూర్తిగా ఉన్నట్టుగానే ఎమ్మెల్యే గారె ఒప్పుకున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని వేణుగోపాల్ రెడ్డి అన్నారు ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్లొద్దు ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళమనే ఎమ్మెల్యే గారు ! ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లే గర్భిణీ స్త్రీలకు అల్ట్రా సౌండ్ రేడియాలజిస్ట్ డాక్టర్ లేడనే విషయాన్ని మీకు తెలియక పోవడం బాధాకరం ఇటువంటి పరీక్షలకి బయటికి వెళ్లడం వల్ల పేద ప్రజలపై అధికంగా ఆర్థిక భారం పడుతుంది ఈ పరీక్షల కొరకు బయటికి పంపిస్తున్న విషయం మీకు తెలుసా, రక్త పరీక్షలు అన్నివేళలా చేయడం లేదు, ఒక సంవత్సరం నుండి డెంటల్ డాక్టర్ లేడు, పేషెంట్స్ కి సరిపోను బెడ్స్ లేవు, శానిటేషన్ సిబ్బందికి సరైన జీతాలు లేక సానిటేషన్ సరిగా జరుగుతలేదన్న విషయాన్ని మీకు తెలియక పోవడం చాలా బాధాకరం, పట్టణంలో ప్రతి వార్డులో 50 లక్షల రోడ్లు 30 లక్షల ట్రైన్లు వేస్తున్నామని చెబుతున్నారు పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎక్కడెక్కడ రోడ్లు వేసినావు చెప్పాల్సిన అవసరం పట్టణ ప్రజలకు ఉన్నది. ఇంటింటికి వాటర్ రావట్లేదని విషయాన్ని తన ప్రసంగంలో ఎమ్మెల్యేని ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నువ్వు అధికారంలో ఉండి ఎనిమిది సంవత్సరాల అయినప్పుటికి కూడా ఇప్పటివరకు ఇంటింటికి త్రాగునీరు అందించకపోవడం బాధాకరం. మినీ రవీంద్ర భారతి గురించి చెప్పిండు అది కూడా పూర్తి చేయని విషయాన్ని తనే ఒప్పుకున్నాడు. వైకుంఠధామం స్మశానవాటికలు ఇన్తవరకు ప్రారంభం చేయలేని విషయాన్ని ఎమ్మెల్యేనే ఒప్పుకున్నాడు రోడ్ల వెడల్పులు ఇంతవరకు పూర్తి కాలేదు అనే విషయాన్ని ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు పట్టణ శివారు ప్రాంతాలైన ఇందిరమ్మకాలనీ ఈదెలగూడెం నందిపాడు వంటి ప్రాంతాలకు వైకుంఠధామాలను ఇంకా నేను అభివృద్ధి చేయలేదని ఒప్పుకున్నాడు, బైపాస్ ప్రాంతంలో వివిధ అసోసియేషన్ బిల్డింగ్స్ లకు సహకరించకపోవడం బాధాకరం. ఈదలగూడెం నుండి హౌసింగ్ బోర్డ్ వరకు గత ఎనిమిది నెలల కాలం నుండి సెంట్రల్ లైటింగ్ లేదు. CMRF బిల్ల్స్ ఇప్పుడు 20 నుండి 30% మాత్రమే ఇస్తున్నారు బాధాకరం మేము 70% నుండి 80% ఇప్పియ్యాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వైకుంఠ రథం గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడటం చాలా హాస్యస్పదం 8 సంవత్సరాల క్రితమే బి ఎల్ ఆర్ వైకుంఠ రథాన్ని తీసుకువస్తే మున్సిపాలిటీ నుంచి రావాల్సిన వైకుంఠ రథాలను ఆపి, మీరు వైకుంఠ రథం తెచ్చేదాకా మున్సిపాలిటీ వైకుంఠ రథాలను ఆపిన విషయం ప్రజలందరికీ తెలుసు బస్తీ దావకాన అన్ని ప్రాంతాలకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన వారికి భోజనం అని చెప్పినారు మీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని మీరే ఒప్పుకున్నారు, ఎప్పుడైనా ఎంతమందికి భోజనాలు పెట్టినారు ప్రజలకు తెలుసు. బి ఎల్ ఆర్ చేసే సేవా కార్యక్రమాలకు తట్టుకోలేకుండా మీరు ఈ కార్యక్రమం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి చేయకపోతే ప్రజలకు నచ్చరు నచ్చకపోతే ఇంటికి పంపిస్తారని మీరే ఒప్పుకున్నారు మీరు ఇంటికి పోవడం తద్యమని మేము తెలియజేస్తున్నం. పెన్షన్ రాని వాళ్ళకి ఆప్షన్ వచ్చినప్పుడు పెన్షన్ ఇప్పిస్తా అంటున్నారు మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని విషయాన్ని మర్చిపోతున్నారు భాస్కర్ రావు తక్షణమే ఆన్లైన్ ఓపెన్ చేపించి పెన్షన్ రాని వారికి తక్షణమే పెన్షన్ ఇప్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మిర్యాలగూడ అభివృద్ధి చెందలేదు అనే విషయాన్ని మీరే ఒప్పుకుంటున్నారు కాబట్టి మిర్యాలగూడ అభివృద్ధి కావాలన్నా మిర్యాలగూడ జిల్లా కావాలన్నా మీ రాజీనామానే వీటన్నిటికీ పరిష్కారం కావున కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు రాజీనామా చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి ప్రభుత్వం మెడలువంచి మిర్యాలగూడ జిల్లా సాధన తో పాటుగా మిర్యాలగూడ అభివృద్ధిని సాధించుకుందాం అని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్లు అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు నాగలక్ష్మి జానీ గంధం రామకృష్ణ అనిత రవి నాయక్ జిల్లా జనరల్ సెక్రెటరీ నాగు నాయక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బసవయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.