Ultimate magazine theme for WordPress.

భాజపా విద్వేషాలు రెచ్చగొడుతుంది హరీష్ రావు

Post top

బీజేపీ మత విద్వేషాలను పెంచుతోంది

 

హైదరాబాద్: బీజేపీ ప్రజలను వదిలేసి ప్రతిపక్షాలపైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సీబీఐ ఏజెన్సీ, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సీబీఐ నోటీస్ ఇస్తుందని బీజేపీ నాయకులు ముందే ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. పార్టీలకు ఏజెన్సీ సమాచారం ఎలా వస్తుందని నిలదీశారు. బీజేపీ తమ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత పేరును తెరపైకి తీసుకొచ్చి, అనంతరం వారి ఇంటిమీద దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఎంఎన్ జే కాన్సర్ ఆసుపత్రిలోని గోల్డెన్ జూబ్లీ బ్లాక్ నాలుగో ఫ్లోర్ లో ఉన్న మాడ్యులర్ థియేటర్లు, దోబీ ఘాట్, కిచెన్ లను మంత్రులు హరీశ్ రావు, హోమ్ మంత్రి మహమూద్ అలీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, టిఎస్ఎమ్ఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆత్పత్రి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశంలో మతవిద్వేషాలను బీజేపీ పెంచుతుందని విమర్శించారు. కేంద్రం కొనను అనెంత పంట మన దగ్గర పండుతుందన్నారు. 20 శాతం బడా వ్యాపారవేత్తలకు బీజేపీ ఉచితాలు ఇచ్చిందన్న హరీశ్ రావు.. తాము మాత్రం 80 శాతం ప్రజలకు ఉచితాలను ఇస్తున్నమన్నారు. కర్ణాటకలో బీజేపీ నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారని, అక్కడ ఎందుకు విచారణ చేస్తలేరని ప్రశ్నించారు. కర్ణాటక కాంట్రాక్ట్ అసోసియేషన్ స్పష్టంగా ఆరోపణలు చేసినా ఎందుకు ఎంక్వెరీ చేస్తాలేరని నిలదీశారు.

 

నెలరోజుల్లో రోబోటిక్ మాడ్యలర్ ఆపరేషన్ థియేటర్

 

తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేన్సర్ పేషెంట్స్ కోసం రూ.700 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసినట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మరో నెల రోజులలో 30 కోట్లు రూపాయలతో నిర్మించిన రోబోటిక్ మాడ్యలర్ ఆపరేషన్ థియేటర్ ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా మరో 300 పడకలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. నిమ్స్ లో ప్రతినెల 8 బోన్ మ్యారో సర్జరీ ని చేస్తున్నామని, ఎమ్ఎన్ జె లో అడ్వాన్సడ్ ఎక్విప్మెంట్ ఉందని మంత్రి వివరించారు. కేన్సర్ చివరి దశలో ఉన్న వారికి ప్యాలెటివ్ కేర్ ని అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్ఎన్ జె కేన్సర్ అసుపత్రికి అనుబంధంగా త్వరలోనే అంకాలజీ నర్సింగ్ స్కూల్ ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.