Ultimate magazine theme for WordPress.

భాజపా మత రాజకీయాలు చేస్తున్నది. సత్యవతి రాథోడ్

Post top

బీజేపీ మత రాజకీయాలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతోంది : మంత్రి సత్యవతి రాథోడ్

 

దేశంలో, రాష్ట్రంలో కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఆమె.. తమ మనవరాలికి అక్షరాభ్యాసం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్‌.. పాదయాత్రకు బదులు మోకాళ్ల యాత్ర చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ర్టానికి రావాల్సిన వాటా తీసుకురావాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన శాస్తి చేస్తారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద బీజేపీ నాయకులు కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. బాసర ట్రిపుల్‌ ఐటీలోని విద్యార్థులు సంయమనం పాటించాలని రెచ్చగొట్టే మాటలు నమ్మి.. భవిష్యత్‌ ఆగం పాడు చేసుకోవద్దని ఒక అమ్మలా చెప్తున్నా.. వినాలని ఆమె కోరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.