Ultimate magazine theme for WordPress.

అలీ ఖాన్ కు అరుదైన గౌరవం

Post top

ఎపిఎ డిజిటల్‌ స్టార్‌ అవార్డ్స్‌ 2022 వేడుకలకు మూసా అలీఖాన్‌

– మూసా అలీఖాన్‌ కు దక్కిన అరుదైన గౌరవం

– హోమ్ మంత్రి మహ్మద్ అలీతో పాటు

హాజరుకానున్న సినీ, రాజకీయ అతిరథ మహారధులు

 

మిర్యాలగూడ : శ్రీనీ ఇన్‌ఫ్రా ఫ్రౌడ్లీ ప్రాజెక్ట్‌ నిర్వహిస్తున్న ఎపిఎ డిజిటల్‌ స్టార్‌ అవార్డ్స్‌ 2022 వేడుకలకు విశిష్ట అతిథిగా మిర్యాలగూడ వాసి, సినీ నటుడు, నిర్మాత, సామాజిక సేవకుడు మూసా అలీఖాన్‌ హాజరుకానున్నారు. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకులు, నటుడు, దర్శకుడు అభినవ్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందినట్టు మూసా అలీఖాన్‌ శుక్రవారం మీడియాకు వివరించారు.

సినీ, రాజకీయ, సామాజిక సేవా రంగాలలో విశేష సేవలు అందించిన అనేక మందికి, మరియు 50 మంది యూ ట్యూబర్ లకు కూడా ఆగస్టు 28వ తేదీ ఆదివారం హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమంలో ఎపిఎ డిజిటల్‌ స్టార్‌ అవార్డ్స్‌ 2022 పేరిట అవార్డులు అందించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ హోం శాఖ మంత్రి మహ్మద్‌ అలీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావుతో పాటు సినీ ప్రముఖులు సంగీత దర్శకుడు రఘు కుంచె, బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ సన్నీ, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మానస్‌, లహరి , సినీ హాస్యనటుడు అలీ అర్ధాంగి జుబేదా సుల్తానాబేగమ్‌ తదితరులతోపాటు మూసా అలీఖాన్‌ కూడా అతిధిగా హాజరుకానున్నారు. సామాజిక సేవకునిగా, సినీ నటుడుగా అంచెలంచెలుగా ఎదుగుతూ, ఎంతో మందికి తన వంతు సహాయ సహకారాలను సైతం అందిస్తున్నారు మూసా అలీఖాన్‌. పేద కళాకారుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, నిత్యం ఎన్నో అవార్డుల వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరవుతూ తనవంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అద్భుతమైన ఫాలోయింగ్‌ను సైతం కలిగి ఉన్నారు. తనపై ఎంతో అభిమానంతో ఎపిఎ డిజిటల్‌ స్టార్‌ అవార్డ్స్‌ 2022 వేడుకలకు ఆహ్వానించిన నిర్వాహకుడు , నటుడు, దర్శకుడు అభినవ్ కు

మూసా అలీఖాన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి యూ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తుంది.

post bottom

Leave A Reply

Your email address will not be published.