జర్నలిస్టులకు హైదరాబాదులో ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కోసం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.