
నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్రాన్ని దే…రేవంత్ రెడ్డి ప్రజాలహరి… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ఎవరు బాధ్యుల అనే విషయాన్ని ప్రజల ఆలోచించాల్సిని అవసరమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు పత్రిక సమావేశంలో మాట్లాడుతూ లిక్కర్ స్కాంపై ఆధారాలు ఉన్నాయని అన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పిటిషన్ పై కేసీఆర్ కుటుంబ సభ్యులపై విచారం చేయకుండా ఇతరులపై దాడులు చేయడం కేసును నీరుగాచటమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భాజపా నాయకులు తామే సిబిఐ, ఈడి అధికారులు అన్నట్లుగా ఆధారాలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారని విమర్శించారు ఈ జగన్నాటకాని కేంద్రం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.