ప్రజాలహరి. భాజపా నాయకులు ఎమ్మెల్యే రాజాసింగ్ మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు పై ఎంఐఎం పార్టీ, ముస్లింలు నుంచి వస్తున్న నిరసనలను నేపద్యంలో హైదరాబాదులో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తుగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలిపారు. ఈరోజు ఆయన ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, హైదరాబాద్ నగర కమిషనర్ లు తో శాంతిభద్రతర పరిరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సమీక్షించారు. ముందుగా అసాంఘిక శక్తులు ప్రభలే చోట కఠినమైన చర్యలు తీసుకోవాలని శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.