మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు విషయమై ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళా:- ఎమ్మెల్యే భాస్కరరావు
మిర్యాలగూడ నాగార్జునసాగర్ హుజూర్ నగర్ నియోజకవర్గాలతో కలిపి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలని జూలై 18 న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకెళ్లానని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు అన్నారు. బుధవారం మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిగా సాధన సమితి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ప్రజల అందరి ఆకాంక్ష అని హుజూర్నగర్ నాగార్జునసాగర్ శాసనసభ్యులు కలిసి వస్తే జిల్లా ఏర్పాటు తేలిక అన్నారు. ఇప్పటికే ఆయా శాసనసభ్యులు కలిసి జిల్లా ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సాధన సమితి సభ్యులు రెండు నియోజకవర్గ శాసనసభ్యులను కలిసి, ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజలతో ఒత్తిడి తెచ్చి జిల్లా ఏర్పాటయ్యేలా కృషి చేయాలని కోరారు. జిల్లా ఏర్పాటు విషయమై అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి జిల్లా సాధన సమితి సభ్యులను తీసుకెళతనన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చి జిల్లా సాధనకు కృషి చేయాలని సభ్యులను కోరారు. కార్యక్రమంలో జిల్లా సమితి కన్వీనర్ మాలోతు దశరధ నాయక్, డాక్టర్ రాజు తాళ్లపల్లి రవి బంటు వెంకటేశ్వర్లు చేగొండి మురళి యాదవ్ జయరాజు జ్వాల వెంకటేశ్వర్లు ఫారుక్ మోసిన్ అలీ ఎస్పీ నాయుడు. తిరందాసు వేణుగోపాల్ డాక్టర్ మునీర్ తదితరులు పాల్గొన్నారు.