
ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి సత్యవతి రాథోడ్
ప్రజాలహరి…
హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత గారి నివాసానికి చేరుకుని పరామర్శించి, సంఘీభావం తెలిపిన తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మీడియాతోమాట్లాడుతూ
ఎమ్మెల్సీ కవిత గారి ఇంటిపైBJPదాడినితీవ్రంగాఖండిస్తున్న.బీజేపీ నేతలు కవిత ఇంటి పైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్య.సీఎం కెసిఆర్ గారి కుటుంబం పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారుదేశంలో బిజెపి విద్వేషాలను రెచ్చగొడుతుంది.బిజెపి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు.దేశంలో మోదీ దుర్మార్గపు పాలన నడుస్తోంది.కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనత బీజేపీదే.సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం బిజెపికి లేదని మంత్రి అన్నారు
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి బిజెపి నేతలపై ఈడి,సిబిఐ ఎందుకు తనిఖీలు చేయడం లేదు.ఈడి,ఐటి అధికారులు బిజెపి కండువా కప్పుకున్న కార్యకర్తల వ్యవహరిస్తున్నారు.
తప్పుడు కేసులకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదనీ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత జోలికొస్తే యావత్ తెలంగాణ కన్నెర్ర చేస్తుంది.బిజెపినాయకులు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు.మళ్ళీ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు BJP ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు ఖబడ్దార్.
అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని కానీ, KCR గారి కుటుంబాన్ని కానీ ఇలా లీకులపేరుతో …నిరాధారమైన కేసుల పేరుతో వేదించాలాని చూస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు అని హెచ్చరిస్తున్నమని మంత్రి సత్యవతి అన్నారు.