రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపం.. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపణ… మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ పట్టణంలో సుందర్ నగర్ కౌన్సిల్ పరిధిలో వేస్తున్న రహదారులు నాసిరకo ఉన్నాయని మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్స్ ఆరోపించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రహదారుల నిర్మాణంలో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదని కంకర, ఇసుక రహదారులుతో దీర్ఘకాలికంగా ఉండేవిధంగా నిర్మించడం లేదని అందుకు విరుద్ధంగా డస్టు, సిమెంట్ తో కలిపి రహదారులు నిర్వహిస్తున్నారని ఇవి ఇప్పటికీ వేస్తున్న మూడు నాలుగు రోజులకే దెబ్బతింటున్నాయని దీర్ఘంగా ఎలా ఉంటాయని వారు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ నిబంధనల మేరకు నాణ్యతతో కూడిన రహదారులు నిర్మించాలని డిమాండ్ చేశారు. కనీసం కౌన్సిలర్ కూడా తెలియజేయకుండా చేయడం బాధాకరమని అన్నారు. ముందుగా కమిషనర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు అనంతరం నరసరావు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ మెట్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసి అనంతరం భోజనాలు చేశారు ఈ విధంగా నిరసనను అధికారుల దృష్టికి పోయే విధంగా చేశారు మిర్యాలగూడ పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి , కౌన్సిలర్లు కుమ్ము, శ్రీనివాస్ శేఖర్ రెడ్డి, నాగలక్ష్మి, చిలుకూరి బాలు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.